ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరాతో దాడి.. భయంతో మంత్రి ముఖానికి ఫేస్ షీల్డ్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 18, 2022, 08:29 AM

ఇటీవలే మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ పై ఓ కార్యక్రమంలో సిరాతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతీబా పూలేపై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయనపై కొందరు సిరాతో దాడి చేశారు. కాగా, తాజాగా పూనేలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ముఖానికి కవచంతో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో కూడా సిరాతో దాడి చేస్తామనే బెదిరింపుల నేపథ్యంలో చంద్రకాంత్ పాటిలో ముఖానికి ఫేస్ షీల్డ్ పెట్టుకొని వచ్చారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com