ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది తుఫానులా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో వైపు రాష్ట్రంలో చలితీవ్రత కూడా రోజురోజుకు పెరుగుతోంది.