మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాష్ట్రంలో వారం రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 19వ తేదీన ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకోనున్నారు. ఆయన పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. సోమవారం రాడిసిన్ బ్లూ హోటల్లో జరుగుతున్న ఇండియా, దక్షిణాసియా అండ్ మిడిల్ ఈస్టు ఫోరం ముగింపు సదస్సులో ఆయన పాల్గొంటారు. 20వ తేదీన తగరపువలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఈనెల 21న దసపల్లా హోటల్లో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుచేసిన సదస్సుకు హాజరై అదేరోజు సాయంత్రం రాజమండ్రి బయలుదేరి వెళతారు.