వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవంతం చేద్దామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జన్మదిన వేడుకల సన్మాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహిద్దామని కోరారు. డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరపబోయే వివిధ కార్యక్రమాల్లో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మమేకం అవ్వాలని కోరారు.