పవన్ నీ ప్యాకేజీ కోసం కాపులను బలి చేయకు, వారితోనూ చంద్రబాబును మోయించ వద్దు..కావాలంటే గాడిదలా నీవు చంద్రబాబును మోయి అని రాష్ట్ర జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టి, మా పార్టీపైనా, నాపైనా విమర్శలు చేశారు. అలా ఆయన చేసినా, ఆయన బీజేపీకి సూటిగా ఒక సందేశం పంపినట్లుగా అర్ధం అయింది. చల్లకు వచ్చి ముంత దాచినట్లుగా.. తాను అక్కడికి వెళ్లి తాను చంద్రబాబుతోనే కలిసి ఉంటానని, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినా, రాకపోయివనా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడిగారినే గాడిదలా మోస్తాను. మీరు కూడా, నాకు సంబందించిన వ్యక్తులు కూడా చంద్రబాబును గాడిదలా మోయండి. నా వ్యూహాన్ని నాకు వదిలేయండి అన్న మాటను బీజేపీకి పంపించారు అని తెలియజేసారు.