తెలుగుదేశం పార్టీ వల్లనే పల్నాడులో అలజడి జరిగిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. గడచిన 40 నెలల నుంచి పల్నాడును పులివెందులతో సమానంగా సీఎం వైయస్ జగన్ అభివృద్ది చేస్తున్నారు. ఫలితంగా దిక్కు తోచని తెలుగుదేశం నాయకలు ఆ ప్రాంతంలో అకృత్యాలు అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ఇదేం ఖర్మరా బాబూ అని పల్నాడు వాసులు అనుకుంటున్నారు. చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సీఎం వైయస్ జగన్ దాదాపు రూ.4700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. అదే గతంలో చంద్రబాబు పాలన సమయంలో 1999–2004 మధ్య, తిరిగి 2014–2019 మధ్య పల్నాడును లూటీ చేశారు. ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారు. అరాచకాలు సృష్టించారు. హత్యలు చేశారు. మళ్లీ ఇప్పుడు అవే మొదలు పెట్టారు. దీంతో పల్నాడు వాసులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. గతంలో చంద్రబాబు పాలన సమయంలో పల్నాడులో మావోయిస్టుల ప్రభావం చాలా ఎక్కువ. కరువు, కాటకాలు ఎక్కువ. పంటలకు నీరందే పరిస్థితి లేదు. మళ్ళీ వాటిని పునరావృతం చెయ్యాలని చూస్తున్నారు అని అన్నారు.