తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్నటి నుంచి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులకు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండానే శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించేందుకు 24 గంటల సమయం ఇచ్చింది. కాగా నిన్న 75 వేల 6 వందల 11 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.