కుల అహంకార, పెత్తందారీ పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళిత వ్యతిరేకంగా పనిచేసిన పాపపు చరిత్ర చంద్రబాబుదే..ఆయన్ను మోస్తున్న పచ్చమీడియా రాతల్ని దళితులు నమ్మరని మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. దళితులను నాలుగు దశాబ్ధాలుగా వేధించడం, అగౌరవపరచడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం, రాజ్యాంగబద్ధంగా దళితులకు సంక్రమించిన హక్కుల్ని హరించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. తెలుగుదేశం పార్టీ ఒక పెత్తందారీ పార్టీ. పూర్తిగా కులంహకార పార్టీగా చెప్పొచ్చు. టీడీపీ అన్నది ప్రతి ఒక్క రంగంలో అంటరానితనాన్ని పెంచి పోషించే పార్టీ. చివరికి, నాలుగు దశాబ్ధాలుగా వ్యాపారం, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య.. ఇలా ఎందులో చూసినా దళిత వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ నడిచింది అని అయన ఆరోపించారు.