సాధారణంగా అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. కానీ మహారాష్ట్రలోని ఓ మహిళా ఎమ్మెల్యే తన చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చారు. నాగ్‌పూర్ ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే తన నవజాత శిశువుతో అసెంబ్లీకి వచ్చారు. ఆమె ఈ ఏఢాది సెప్టెంబర్ 30న బిడ్డకు జన్మనివ్వగా, బిడ్డతో కలిసి నేడు అసెంబ్లీలోకి వచ్చారు. "COVID కారణంగా నాగ్‌పూర్‌లో గత 2.5 సంవత్సరాలుగా ఎటువంటి సెషన్ నిర్వహించబడలేదు. నేను ఇప్పుడు తల్లిని, కానీ నా ఓటర్లకు సమాధానాలు చెప్పడానికి వచ్చాను" అని ఆమె తెలిపారు.