మాచర్ల అల్లర్లకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడే కారణమని ప్రభుత్వ విప్, వైయస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.నరసరావుపేటలోని జీబీఆర్ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పిన్నెల్లి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం వేర్వేరుగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంటే టీడీపీకి అక్కసు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కొంత కాలంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతుండటం దారుణం అన్నారు. ఇందులో భాగంగా నెలవారి మామూళ్లతో బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని నియమించారన్నారు.