1971 ఇండో-పాక్ యుద్ధంలో పోరాడిన బీఎస్ఎఫ్ జవాన్ లాన్స్ నాయక్ భైరోన్ సింగ్ (81) జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు భారత సరిహద్దు భద్రతా దళం సంతాపం తెలిపింది. 1971 లంగేవాలా యుద్ధంలో బైరాన్ సింగ్ ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ, దేశానికి ఆయన చేసిన గొప్ప సేవకు BSF ప్రశంసించింది. యుద్ధ సమయంలో, అతను జైసల్మేర్‌లోని థార్ ఎడారిలో బీఎస్ఎఫ్ యూనిట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశాడు.