మనుబోలు జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వారి సిబ్బంది నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనుబోలు పాఠశాలలో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి తను వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.