కర్ణాటకలోని నరగుండ తాలూకా హద్ది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దారుణం జరిగింది. 4వ తరగతి విద్యార్థిని విచక్షణరహితంగా కొట్టాడో టీచర్. గడ్డపారతో దాడి చేయడంతో ఆ విద్యార్థి మృతి చెందాడు. తరగతి గదిలో పిల్లలు అల్లరి చేస్తుండటంతో కొపోద్రిక్తుడైన ముత్తప్త హడగలి అనే ఉపాధ్యాయుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పట్టరాని కోపంతో గడ్డపారతో విద్యార్థులను చితకబాదాడు. ఆ దెబ్బలు తాళలేక విద్యార్థులు అరుపులు, కేకలు, ఏడుపులు మొదలు పెట్టారు. ఆ దెబ్బలకు నాల్గో తరగతి చదువుతున్న భరత్ (10) తట్టుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్కూల్లోని మిగతావారు వచ్చి ఆ ఉన్మాది టీచర్ ను అదుపుచేసి.. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మధ్యలోనే భరత్ ప్రాణాలు కోల్పోయాడు.