ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి ఓ క్లబ్ కు వెళ్లిన బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. గార్వేర్ క్లబ్ లోని 5వ అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్లబ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతిచెందాడని అతని కుటుంబం ఆరోపించింది. దీనిపై విచారణ జరుగుతోందని మెరైన్ డ్రైవ్ పోలీసులు తెలిపారు.