తనకు గర్ల్ ఫ్రెండ్ గా మారితే పరీక్షలో పాస్ చేస్తానని యువతిని వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బాధిత యువతి మహారాజ్ పుర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తూ కాన్పూర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటోంది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఆమె మ్యాథ్స్ సబ్జెక్టులో ఫెయిలవ్వడంతో రీకౌంటింగ్ కట్టింది. నవంబరులో యువతి ఫోన్ కు గుర్తుతెలియని నెంబర్ నుండి ఫోను మెసేజ్ వచ్చింది. పరీక్షలో పాస్ కావాలనుకుంటే నాకు రూ.5 వేలు ఇవ్వు, నా గర్ల్ ఫ్రెండ్ గా మారు అంటూ ఆ మెసేజ్ లో ఉంది. ఆ ప్రతిపాదనను యువతి తిరస్కరించింది. తీరా రీకౌంటింగ్ ఫలితాలు చూసుకునే సరికి యువతి మళ్లీ ఫెయిల్ అయింది. గతంలో 11 మార్కులు రాగా, రీకౌంటింగ్ లో సున్నా వచ్చాయి. ఇది తనకు ఫోన్ చేసిన వ్యక్తి పనే అని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.