ఉత్తర అమెరికా తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా విజయవాడ నందు ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహిస్తున్న 5 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు పెనుకొండ కు చెందిన ప్రముఖ కవి, రచయిత, సామాజిక సేవా కార్య కర్త అయిన జాబిలి చాంద్ బాషాను 24 వ తేదీ జరగబోవు పత్రికా ప్రతినిధుల సదస్సుకు ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రసంగించ వలసినదిగా ఈ సభల నిర్వాహక ప్రధాన కార్యదర్శి జి. వి. పూర్ణచంద్ ఆహ్వానించారని అయన బుధవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సభలలో జాబిలి చాంద్ బాషా పత్రికా స్వేచ్చపై, పత్రికల నిర్వహణ విదివిధానాలపై, పాత్రికేయుల సమస్యలపై ముఖ్యంగా రాయల సీమలో పత్రికల మనుగడపై మాట్లాడబోతున్నాని తెలిపారు.