ఫ్యాక్షన్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ముద్దనూరు సిఐ మోహన్ రెడ్డి హెచ్చరించారు. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండల పరిధిలోని కోడిగాండ్ల పల్లెలో బుధవారం తెల్లవారుజామున సీఐ ఆధ్వర్యంలో ఎస్సై చంద్రమోహన్ పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో అనుమానితుల గృహాలు, గడ్డివాములు, ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు.