పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలానికి అదనంగా మరో ఖాజీని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నెర్సుపల్లెకు చెందిన సయ్యద్ జీషాను ఖాజీగా నియమించారు. ముస్లిం వివాహాలు జరిపించేందుకు అధికారం కల్పిస్తూ ఈ అదనపు ఖాజీ నియమకం జరిగింది. మూడేళ్లు ఈయన కఖాజీగా వ్యవహరించనున్నారు. ఇది వరకే నియమించిన మహమ్మద్ జాఫర్ షరీఫ్ కు కుమార కాల్వ , కుప్పం , కె. ఎర్రగుడి, కె. రాజు పల్లె, మారెళ్ళ గ్రామాలను, ప్రస్తుతం నియమించిన ఖాజీ సయ్యద్ జీషాన్ సురభి, చక్రాయపేట, నెర్సుపల్లె, చిలేకంపల్లి గ్రామాల్లో వివాహాలు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం డి ఉత్తర్వులు జారీ చేశారు.