జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ సందర్భంగా భూపేష్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ఇండ్ల మీద దాడులు చేయడం సమంజసం కాదన్నారు. వైసీపీ పాలనలో ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క పల్నాడు లోనే 16 మంది టిడిపి కార్యకర్తలను హత్యలు చేసినారన్నారు. అధికారులు వైసిపి నాయకులకు వత్తాసు పలుకు తున్నారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, దాడిశెట్టి శ్రీను, సుధీర్ కుమార్ రెడ్డి, చెన్నయ్య, భాష, బాబు, జూబ్లా నాయక్, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.