పెద్ద ఉద్యోగం, కోట్లలో జీతాన్ని వదులుకొని సన్యాసిగా మారేందుకు సిద్ధమయ్యాడో యువకుడు. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రన్ సుఖ్ కాంతేడ్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర చదివిన తర్వాత డేటా శాస్త్రవేత్తగా స్థిరపడ్డాడు. అక్కడ ప్రన్ సుఖ్ జీతం ఏడాది రూ. 1.25 కోట్లు. అయితే ఆ జీవితం అతనికి సంతృప్తి ఇవ్వలేదు. దీంతో నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు నిర్ణయించుకున్నాడు. జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్న ప్రన్ సుఖ్ 2021 జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్ కు వచ్చేసాడు. ఈనెల 26న జినేంద్ర ముని వద్ద జైన సన్యాస దీక్ష తీసుకోనున్నాడు. తమ కుమారుడు జైన సన్యాసి కాబోతుండటంపై అతడి తల్లితండ్రులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.