ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో ప్రకటించిన గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో ఈ నెల 24 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు రూ.50, ఈ నెల 30 నుంచి జనవరి 3 వరకు రూ.200, జనవరి 4 నుంచి జనవరి 9 వరకు రూ.500 అపరాధ రుసుముతో ఫీజులు చెల్లించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.