ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో కేంద్రం కొత్తగా ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొవిడ్ ప్రోటోకాల్స్‌ను మళ్లీ అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదే నిజమైతే ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించడం, విమానాశ్రయాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్‌లల్లో కరోనా పరీక్షలు చేపట్టడం, క్వారంటైన్‌లో ఉంచటం తప్పనిసరి అవుతుంది. అలాగే ప్రజలంతా బూస్టర్ డోసులు వేసుకునేలా కేంద్రం చర్యలు చేపట్టనుంది. నేడు మధ్యాహ్నాం ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.