గడపగడపకు సంక్షేమమే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూపకల్పన చేశారని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వార ప్రజల నుండి నేరుగా తెలుసుకుంటున్న సమస్యలపై నిర్లక్ష్యం వద్దని సచివాలయ సిబ్బందికి కెకె. రాజు సూచించారు.
ఈమేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 14 వ వార్డు పరిథి బిఎస్ లేఔట్ తదితర ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు వార్డు కార్పోరేటర్ అనిల్ కుమార్ రాజు తో కలిసి గురువరం ఉదయం పర్యటించారు. కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుల మతాలకు, రాజకీయలకు అతీతంగా నిష్పక్షపాతంగా అందాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారని అన్నారు. సంక్షేమ ఫలాలు గడపగడపకు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారుల వద్ద నుండి ప్రజ ప్రతినిథులు నేరుగా అడిగి తెలుసుకునేందుకు వారి సమస్యలను వినతుల రూపంలో తీసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు.