ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవత్వం చాటిన ఇంటూరి నాగేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 03:34 PM

గుడ్లూరు మండలం గుళ్లపాలెం అడ్డరోడ్డు వద్ద గురువారం ఉదయం ప్యాసింజర్ ఆటో బోల్తాపడి పలువురు మహిళలకు గాయాలయ్యాయి. రాళ్లపాడు గ్రామానికి చెందిన మహిళా కూలీలు కందుకూరు వైపు వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు ప్రక్కన తిరగబడింది. అదే సమయంలో అటుగా వెళుతున్న కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు స్పందించి ఆటోలో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. గాయపడ్డ మహిళలను నాగేశ్వరరావు కారులో కందుకూరు హాస్పిటల్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com