కందుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గురువారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తూ పేద విద్యార్థుల చదువుకు మంచి అవకాశాలు కల్పిస్తుందన్నారు. దీనిని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్యాబ్‌లో అవాంఛనీయ సైట్ల యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమర్చినట్లు తెలిపారు. కందుకూరు మండలంలోని 612 మంది విద్యార్థిని విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు.