పల్నాడు జిల్లా, నరసరావుపేటలో ఇటీవల హత్యకు గురైన షేక్ ఇబ్రహీం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు మళ్ళాల బాలాజీ, వరవకట్ట బాబులను పోలీసులు అరెస్టు చేశారు. జామీయా మసీద్ విషయంలో వివాదాలే ఈ హత్యకు కారణంగా పోలీసులు నిర్ధారించారు. 20న ఓ పథకం ప్రకారం షేక్ ఇబ్రహీం, షేక్ రహమత్ అలీపై మళ్లలా బాలాజీ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో షేక్ ఇబ్రహీం అక్కడికక్కడే మృతి చెందగా.. షేక్ రహమత్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa