క్రిస్టియన్లను అన్ని విధాలా నట్టేట ముంచిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిదేనని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యా లయం లో శుక్రవారం ప్రీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ క్రిస్టియనగా చెప్పుకునే జగన క్రిస్టియన కార్యక్రమాలకు పంగనామాలు పెట్టారన్నారు. ఎస్సీ కార్పొరేషనను నిర్వీర్యం చేశారని, ఎస్సీ సబ్‌ప్లాన నిధులు ఆపేశారని దుయ్యబట్టారు. క్రిస్టియన్లను దళిత క్రిస్టియన్లుగా గుర్తించాలని కేంద్రా నికి ప్రతిపాదనలు పంపింది టీడీపీ హయాంలోనే అని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో రూ.16 కోట్లు మంజూరు చేసి, క్రైస్తవ భవన నిర్మాణాన్ని ప్రారంభిం చామన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.50వేలు, జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి రూ.40వేలు సాయం చేశామన్నారు. రేషన షాపుల ద్వారా కిస్మస్ కానుక ఇచ్చేవారమని, జగన సీఎం అయిన తర్వాత వాటన్నింటినీ నిలిపేశారన్నారు. దళి తులు, గిరిజనులు, క్రిస్టియన్లకు చెందిన 27 పథకాలు ఆపేసిన చరిత్ర ముఖ్యమం త్రి జగనకే దక్కుతుందన్నారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షు డు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ క్రైస్తవులకు శ్మశాన వాటిక లేదంటే అల్లీపురంలో ఐదెకరాల కార్పొరేషన స్థలాన్ని కేటాయించామన్నారు. రూ.2.5కోట్లతో ఆ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. గీతాలాపనలు, చిన్నపిల్లల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్, పరసారత్నం, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కంభం విజయరామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, డాక్టర్ శివప్రసాద్, ఊరందూరు సురేంద్రబాబు, చేజెర్ల వెంకటేశ్వరరెడ్డి, జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.