కడప జిల్లా చెన్నూరు మండల పరిధిలో ఉన్నా గిరిజన కాలనీలో ఆదివారం ఉదయం బీజేపీ చెన్నూరు మండల అధ్యక్షులు రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహార్ వాజ్ పేయి 98వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు బొజ్జప్ప ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండల అధ్యక్షులు శ్రీరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ రక్షణ కోసం పోక్రాన్ 2 పరీక్షలు చేయించిన సాహసి దేశభక్తికి గీటు రాయి నీతికి నిలువెత్తు ప్రతిరూపం భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి అని అన్నారు.
గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జప్ప మాట్లాడుతూ అటల్ జి తీసుకువచ్చిన గ్రామ సడక్ యోజన మారు మూల ప్రాంతాలకు రోడ్లు వేయడం ఈ పథకం గ్రామీణ వాసులకు ఎంతో ప్రయోజనం కలిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గిరిజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరైన సక్రమమైన పద్ధతిలో అమలు చేయడం లేదని గిరిజన పథకాలను అన్నిటిని కూడా ప్రభుత్వం నిర్విరారం చేస్తుందని మరియు కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇస్తున్న పథకాలను కూడా అమలు చేయకపోవడం ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. ఈనెల 28, 29, 30 న విశాఖపట్నంలో జరుగు గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షులు సమీర్ ఒరాన్ దృష్టికి తీసుకుపోతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదినేని రామసుబ్బయ్య, భరత్ రెడ్డి, శ్రీను, రవికుమార్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగన్న పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa