ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్ సౌకర్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 06:53 PM

రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా అతి తక్కువ ధరలలో ఇంటర్నెట్ సేవలు అందించాలనే సీఎం జగన్మోహనరెడ్డి ఆశయానికి అనుగుణంగా ఏ పి ఫైబర్ నెట్ నెలకి రూ. 190 కి 20ఎం బి పి ఎస్ స్పీడ్తో 400జిబి , రూ. 249కి 50ఎం బి పి ఎస్ స్పీడ్ తో ఆన్ లిమిటెడ్ నూతన ప్యాకేజీలని అందుబాటులోకి తీసుకుని వచ్చినట్టు జిల్లా మార్కెటింగ్ మేనేజర్ లోకానందం గౌతమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో సంబంధిత గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం గౌతమ్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుంటారని కోరారు. వచ్చే ఏడాది జనవరి 6వ తారీఖు నుండి ఏపీఎస్ఎఫ్ఎల్ బిల్లింగ్ విధానం పోస్టుపైడ్ నుండి ప్రీపెయిడ్ లోనికి మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa