చైనా, జపాన్ సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండం వల్ల భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవాళ (డిసెంబర్ 27) మాక్‌డ్రిల్ నిర్వహించనున్నాయి. మాక్ డ్రిల్‌లో భాగంగా అన్నిఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకల సామర్థ్యం, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్‌లలో కరోనా పరీక్షల సామర్థ్యం, ఆర్టీపీసీఆర్, ఆర్‌ఏటీ కిట్స్, పరీక్షల నిర్వహణకు అవసరమైన రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉన్నాయా లేదా అని అక్కడి అధికారులు పరిశీలిస్తారు. ఏదైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దుతారు.