ఒకరి మీద కోపంతో ఓ యువకుడు చేసిన పనికి 20 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీలోని సుభాష్ నగర్లో 4 అంతస్తుల పార్కింగ్ భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే ఓ వ్యక్తి కావలనే కారుకు నిప్పు పెట్టడాన్ని సీసీటీవీ ఫుటేజ్ల్లో గమనించారు పోలీసులు. అనంతరం ఆ మంటలు మిగిలిన కార్లనూ చుట్టుముట్టాయని తెలుసుకున్నారు. నిందితుడు 23 ఏళ్ల యశ్ అరోడాగాను అదుపులోకి తీసుకుని విచారించగా ఆకారు యజమానిపై కోపంతో అలా నిప్పుపెట్టానని చెప్పాడు. అతను తన కుటుంబసభ్యుల్లో ఒకరితో సంబంధం పెట్టుకోవడంతో అసహనానికి గురయ్యానని యశ్ పోలీసులకు తెలిపాడు. నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.