భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవటంతో భార్య ప్రాణాలు తీసుకున్న ఘటన చైన్నైలో జరిగింది. మధురవాయల్ గంగై అమ్మన్ ఆలయ వీధికి చెందిన రాజా ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైమవ్వగా, ఏడాది వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. ఈక్రమంలో రాజా వేరే మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఓ రోజు రాజా ఇంటికి వచ్చేసరికి భార్య కిచెన్‌లో ఉరికి వేళాడుతూ కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.