భారత్లో కరోనా కేసులు స్పల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 49,464 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 157 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,459కి చేరింది. 4,41,43,342 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,421 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో ఒకరు మృతి చెందడంతో, మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,696కి చేరింది. ఇప్పటి వరకు 220.06 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.