వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్న యువకుడు రాత్రి తనతో ఉండేందుకు ఒప్పుకోలేదని ఆమెను చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. బాగ్‌పట్‌కు చెందిన రచన(44) ఓప్రైవేటు కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తోంది. భర్త కూలీ పనులు చేస్తుంటాడు. కొన్నాళ్లుగా రచనకు బిహార్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. ఈక్రమంలో మీరట్‌లో కలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అక్కడే హోటల్లో ఉన్న తర్వాత ఈనెల 25న రాత్రి తనతోనే ఉండాలంటూ గౌతమ్ గొడవపడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో గొంతు నులిమి చంపి, ఉదయాన్నే పరారయ్యాడు. హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వటంతో పోలీసులు నిందితున్ని వెదికిపట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై రచన భర్తకు సమాచారమిచ్చారు.