అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతుంది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచు, తీవ్రమైన చలిగాలులతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 60మందికి పైగా మృత్యువాత పడ్డారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సివచ్చింది. మంచు వల్ల రోడ్లపై దారి సరిగ్గా కనిపించకపోవటంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి అనేకమంది చనిపోతున్నారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.