చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్‌తో ప్రజలు విలవిల్లాడుతున్న వేళ అక్కడ మందుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఫైజర్ రూపొందించిన కరోనా ఔషధం ‘పాక్స్‌లోవిడ్’ను బీజింగ్‌లో పంపిణీ చేసేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం నగరంలోని హెల్త్ సెంటర్లలో ఏర్పాట్లు చేస్తుంది. చైనాలో కొవిడ్ చికిత్సలో వినియోగించడానికి అనుమతి పొందిన విదేశీ ఔషధం పాక్స్‌లోవిడ్ ఒక్కటే. గతంలో చైనా రూపొందించిన ‘అజ్వుడిన్’ అనే కొవిడ్ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురాగా, కొన్ని గంటల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి. అటు చాలా మంది డాక్టర్లల్లో జ్వర లక్షణాలు కనిపిస్తున్నా,పేషెంట్లకు సేవ చేస్తున్నారు. దీంతో చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.