మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ జారీ అంశంలో మంత్రి రజినికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంతో మంత్రి రజిని హస్తం ఉందంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మంత్రి విడదల రజినితో పాటు స్థానిక తహసీల్దార్ కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను 3వారాలపాటు వాయిదా వేసింది.