దేశంలోనే ఆందోళన కలిగిస్తున్న బీఎఫ్ 7 వేరియంట్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్లు, పిల్లలు, గర్భిణులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు సన్నాహకంగా నిర్వహించిన మాక్ డ్రిల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా దేశాల నుండి వస్తున్న నివేదికల ప్రకారం, వృద్ధులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారిలో ఈ వైరస్ యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉందని సూచించబడింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.