గర్భిణీల కోసం ‘స్వాస్థ్ గర్భ్’ అనే మొబైల్ యాప్ ను రూర్కీ ఐఐటీ, ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు రూపొందించారు. వైద్య సహాయం పెద్దగా లేని గ్రామీణ ప్రాంతాల్లో ఈ యాప్ ఉపయోగకరమని తెలిపారు. గర్భిణీల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, సమయానుగుణంగా తీసుకోవాల్సిన వైద్యం, చేయించుకోవాల్సిన పరీక్షలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ఈ యాప్ పని చేస్తుందని వెల్లడించారు. గర్భం సమయంలో సాధారణంగా వచ్చే సమస్యలకు ఈ యాప్ పరిష్కారం సూచిస్తుందని అన్నారు. మెషీన్ లెర్నింగ్ పరిజ్ఞానంతో ఈ యాప్ పని చేస్తుంది.