ఏపీలో వైఎస్సార్ పింఛను కానుక కింద ఇచ్చే రూ.2500 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రూ.2750 కు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారోత్సవాలు నిర్వహించారని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 3 నుండి 9 వరకు ఈ వారోత్సవాలను జరపనున్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 3న రాజమండ్రిలో జరిగే ప్రారంభ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు.