ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ యూఏఈ నుంచి వచ్చే ప్రయాణీకులకు ఆ సంస్థ కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది. అరబ్ దేశాల నుంచి తమ విమానాల్లో భారత్ కు వచ్చే వారు తప్పనిసరిగా షెడ్యూల్ ప్రకారం పూర్తిస్థాయిలో కరోనా టీకా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే విధిగా మాస్కులు ధరించాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరింది. అయితే 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ, లక్షణాలు ఏమైనా ఉంటే టెస్టులు చేయించుకోవాలని, క్వారంటైన్ లో ఉండాలని సూచించింది.