చైనాలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. షాంఘై సమీపంలోని జిజెయాంగ్ లో రోజుకు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు 25లక్షలు దాటొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. కేసులు ఇలా నమోదవుతుంటే, మరోవైపు చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని, విదేశాల నుండి వచ్చేవారికి మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనను ఎత్తివేసింది. ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. కరోనాను డెంగీ జ్వరాలతో సమానమైన బీ కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది.