ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత, ఇప్పుడు భారతీయ రైల్వేపై సైబర్ దాడి వార్తలు జోరందుకున్నాయి. రైల్వే టికెట్లు బుక్ చేసుకున్న 30 మిలియన్ల మంది డేటాను హ్యాకర్లు దొంగిలించినట్లు తెలుస్తోంది. ‘మనీ కంట్రోల్’ వెబ్ సైట్ నివేదిక ప్రకారం, రైల్వేస్ పై సైబర్ దాడి మంగళవారం జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఈ హ్యాకర్ ఫోరం నిజస్వరూపం వెల్లడి కాలేదు. కానీ, దానిని ’షాడోహ్యాకర్’గా పిలుస్తున్నారు. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతకు ముందు 2020లో హ్యాకర్లు 90 మంది వ్యక్తిగత డేటాను దొంగిలించారు.