కరోనా విజృంభిస్తున్న వేళ బూస్టర్ డోస్ తీసుకోవడంపై వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ ఎన్.కె.అరోరా స్పష్టత ఇచ్చారు. బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించారు. నాసల్ వ్యాక్సిన్ లో 'యాంటిజెన్ సింక్' అనే కాన్సెప్ట్ ఉందని, పదే పదే నిర్దిష్ట రకం యాంటిజెన్ తో ఇమ్మ్యూనైజ్ చేస్తే శరీరం స్పందించదని చెప్పారు. బూస్టర్ డోస్ తీసుకోని వారు నాసల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెప్పారు. 18 ఏళ్లు పైబడిన వారు నాసికా వ్యాక్సిన్‌ను పొందవచ్చని, నాసికా రంధ్రంలో 4 చుక్కలు, మొత్తం 0.5 మి.లీ. వేయాలని చెప్పారు.