నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణంలో, నందికొట్కూరు నియోజకవర్గ స్థాయిలో వున్న అన్ని మండలాల లోని 8వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ట్యాబులను నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు సాంకేతికమైన నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన బైజూస్ యాప్ లతో కూడిన ఉచిత ట్యాబ్ లను పంపిణీ చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోని, ఉన్నతమైన సాంకేతికపరమైన విద్యను నేర్చుకోవాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాములపాడు గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మ,పాములపాడు మండల తహసిల్దార్ రత్న రాధిక,మండల ఇన్చార్జి అభివృద్ధి అధికారి సుమిత్రమ్మ,మండల విద్యాధికారి బాలాజీ నాయక్, కొత్తపల్లి ఎంఈఓ శ్రీరాములు, పగిడ్యాల ఎంఈఓ సుభాన్, మిడుతూరు ఎంఈఓ మౌలాలి,నందికొట్కూరు ఎంఈఓ ఫైజున్నీస, జూపాడు బంగ్లా మండల ఇంచార్జ్ ఎంఈఓ, పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీంద్ర,మండల జడ్పిటిసి సభ్యులు రామలింగేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మండల కో ఆప్టెడ్ మెంబర్ ముర్తుజ అలీ,ఎంపీటీసీ నల్లమల్ల రమాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, శేక్షావలి, ఇస్కాల గ్రామ సర్పంచ్ మౌలాలి, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వరప్రసాదరావు, రిటైర్డ్ హెడ్మాస్టర్ కృష్ణుడు, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు,, విద్యార్థిని,విద్యార్థులు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.