జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకు హాజరైనందుకు ఏపీ మంత్రి రోజా విమర్శించారు. ఇప్పటి వరకు ఏ షోకి హాజరుకాని పవన్ కళ్యాణ్ ఈరోజు అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యాడని అన్నారు. చంద్రబాబు ముందుగా షోకు హాజరయ్యారని, ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా ప్యాకేజీతో షోకు హాజరయ్యారని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ కోసం దేనికైనా దిగజారే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ, బీజేపీ జెండాలు మోస్తున్నారని, జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలని రోజా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa