దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మరణిస్తున్నారు. రోజూ సగటున 1,130 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 422 మంది మరణిస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మృతి చెందారని, 3,84,448 మంది గాయపడ్డారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలు 8.1% తగ్గినట్టు చెప్పింది. మృతుల సంఖ్య మాత్రం 1.9 శాతం పెరిగిందట. 2020 కంటే 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం, గాయపడినవారి సంఖ్య 10.39 శాతం పెరిగాయి. 2021లో ప్రమాదాల మృతుల్లో 67.7 శాతం 18–45 ఏళ్లలోపు వారే కావటం గమనార్హం.