పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివ్ నంద్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం రాజమండ్రికి చేరుకుంది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈలు రాజేశ్ కుమార్, వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ దేవేందర్ రావు ఈ బృందంలో ఉన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పనను కూడా ఈ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. కాగా, పీపీఏ సీఈఓగా శివ్ నంద్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టు పనులను పరిశీలించడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa