తుపాను ప్రభావంతో అమెరికా అల్లాడుతోంది. న్యూయార్క్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నయాగరా జలపాతం గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల దాకా పడిపోవడంతో అందాల జలపాతం కాస్తా మంచు కొండగా మారిపోయింది. వాటర్ ఫాల్స్ దగ్గర ఆర్కిటిక్ వాతావరణం నెలకొందని స్థానికులు చెబుతున్నారు. జలపాతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నీటి ప్రవాహం మొత్తం గడ్డకట్టి వింటర్ వండర్ ల్యాండ్‌ను తలపిస్తోందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.