కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు, విభజన హామీలపై మాట్లాడినట్లు సమాచారం. అయితే బుధవారం కూడా సీఎం జగన్ ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. పోలవరం ప్రాజెక్ట్, పెండింగ్ బకాయిలు, ఇతర అంశాలపై ప్రధాని మోడీతో సుధీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, ఏపీకి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజన సమస్యలు, మూడు రాజధానుల అంశంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వాడీవేడీగా ఉంది. ముందస్తు ఎన్నికలు రానున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఇప్పటి నుంచే సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు.